LIC New Policy: ‘Smart Pension Plan’ for
Secure Retirement and Family Benefits – Details Here
ఎల్ఎస్ఐసీ నూతన
పాలసీ: ‘స్మార్ట్ పెన్షన్ ప్లాన్’ – సింగిల్ ప్రీమియంతో జీవితాంతం
పెన్షన్ - పూర్తి వివరాలు ఇవే
=====================
ప్రభుత్వరంగ
జీవిత బీమా సంస్థ ఎల్ఎస్ఐసీ (LIC).. 'స్మార్ట్ పెన్షన్
ప్లాన్'
(LIC Smart Pension Plan) పేరిట కొత్త
యాన్యుటీ ప్లాన్ ను తీసుకొచ్చింది. సింగిల్ ప్రీమియంతో జీవితాంతం పెన్షన్
పొందొచ్చన్నమాట. సింగిల్ లైఫ్ తో పాటు జాయింట్ లైఫ్ యాన్యుటీ సదుపాయాలను ఈ ప్లాన్
అందిస్తోంది.
ఎల్ఎస్ఐసీ
కొత్త పెన్షన్ ప్లాన్... నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్/ గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్ (ప్లాన్ 879). వార్షికంగా, ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీ
యాన్యుటీ చెల్లింపులు పొందొచ్చు. కొన్ని షరతులకు లోబడి పాక్షికంగా లేదా పూర్తిగా
విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. రుణ సదుపాయం కూడా ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్
సబ్ స్క్రైబర్లు తక్షణ యాన్యుటీ పొందే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.
పెన్షన్
ప్లాన్ పూర్తి వివరాలు
> 18 నుంచి 100 ఏళ్లలోపు (యాన్యుటీ
ఎంపికను బట్టి) ఎవరైనా ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ను కొనుగోలు చేయొచ్చు.
> ఈ
ప్లాన్ కు మార్కెట్ తో సంబంధం లేదు. మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా మన
సొమ్ముకు గ్యారెంటీ ఉంటుంది.
> ఇందులో
సింగిల్ లైఫ్ తో పాటు జాయింట్ లైఫ్ కవర్ కూడా ఉంది. అంటే జీవిత భాగస్వామికి కూడా
ఆర్థిక భద్రత అందించొచ్చు.
> నెలవారీ
వెయ్యి రూపాయలు, మూడు నెలలకు రూ.3వేలు, ఏడాదికి రూ.12వేలు చొప్పున కనీసం యాన్యుటీ పొందొచ్చు.
> నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి చొప్పున పాలసీదారుడు యాన్యుటీ చెల్లింపుల
ఆప్షన్ ఎంచుకోవచ్చు.
> కనీసం
రూ.1 లక్ష వెచ్చించాల్సి ఉంటుంది. గరిష్ఠ కొనుగోలుపై పరిమితి
లేదు (ఆమోదానికి లోబడి)
> ఈ
పాలసీకి ఫ్రీ-లుక్ పీరియడ్ లేదా మూడు నెలలు దాటిన తర్వాత రుణ సదుపాయం కూడా
పొందొచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.
యాన్యుటీ
ఆప్షన్లు..
> మీ
జీవితం మొత్తం పెన్షన్ పొందే అవకాశం.
> 5/10/15/20 సంవత్సరాల పాటు ఎంపిక చేసిన కాలానికి గ్యారంటీ పెన్షన్.
> ఏటా 3% లేదా 6% పెరుగుతూ ఉండే
పెన్షన్.
> జీవితాంతం
పెన్షన్.. పైగా కట్టిన మొత్తం తిరిగి అందించే సదుపాయం.
> జాయింట్
లైఫ్ పెన్షన్ తో భార్యాభర్తలు జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం.
> నూరు
శాతం పెన్షన్.. కొనుగోలు చేసిన మొత్తం పూర్తి రిఫండ్.
> 50% లేదా 100% పెన్షన్
భాగస్వామికి వచ్చేలా.
> 75/80 ఏళ్ల వయస్సు వచ్చాక మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చే పెన్షన్
ఆప్షన్.
=====================
=====================
0 Komentar