NEET-UG 2025: All the Details Here
నీట్ (యూజీ)
- 2025:
పూర్తి వివరాలు ఇవే
====================
వైద్య విద్యా
కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్
టెస్ట్) యూజీ (నీట్ యూజీ 2025) పరీక్షకు
నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మే 4న
నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్
కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు
మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు
రుసుం: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్
అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 07.02.2025
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేది: 07.03.2025
అడ్మిట్ కార్డులు
విడుదల: 01.05.2025
పరీక్ష తేది:
04.05.2025
పరీక్ష సమయం:
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు.
ఫలితాల
విడుదల తేదీ: 14.06.2025
====================
====================
0 Komentar