PM Internship Scheme 2025 – All the
Details Here
ప్రధానమంత్రి
ఇంటర్న్షిప్ పథకం 2025 – పూర్తి వివరాలు ఇవే
==================
ప్రధానమంత్రి
ఇంటర్న్షిప్ పథకం కింద అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం (ఫిబ్రవరి 22) ప్రారంభమైంది. మన దేశంలోని 500 అగ్రగామి కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్
షిప్ చేసేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. దానివల్ల అభ్యర్థులు తమ నైపుణ్యాలను
మెరుగుపరుచుకొని ఉపాధి పొందడం సులవవుతుంది.
ఆన్లైన్
పోర్టల్లో ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో
రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంపికైనవారికి 12 నెలలపాటు
రూ.5 వేల చొప్పున అందిస్తారు. ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారు. 21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ
పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 22/02/2025
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 12/03/2025
==================
==================
0 Komentar