Union Budget 2025-26:
Highlights & Key Features – All the Details Here
యూనియన్
బడ్జెట్ 2025-26:
కీలక ప్రకటనలు ఇవే
====================
బడ్జెట్ తర్వాత
ఏ వస్తువులపై ధరలు పెరగున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్
సంబంధించిన కేటాయింపులు ఇవే
కొత్త పన్ను
విధానంలో మార్చిన శ్లాబ్ ల వివరాలు ఇవే
====================
నేడు ఫిబ్రవరి
1 న కేంద్ర బడ్జెట్ (Union Budget)ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లో ప్రవేశపెట్టారు.
====================
బడ్జెట్ తర్వాత
ఏ వస్తువులపై ధరలు పెరగున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
తగ్గేవి ఇవే:
> క్యాన్సర్, దీర్ఘకాల వ్యాధులను నయం చేసే 36 రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించారు. దీంతో ఈ
మందుల ధరలు దిగి రానున్నాయి.
> ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు.
> కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్
బ్యాటరీ తుక్కు, లెడ్, జింక్ సహా 12 రకాల క్రిటికల్ మినరల్స్ కు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు.
> ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించే 35 రకాల ముడి పదార్థాలు, మొబైల్ ఫోన్ తయారీ బ్యాటరీలో
వినియోగించే 28 అదనపు పరికరాలను పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో
చేర్చారు. దీంతో ఈవీలు, మొబైల్స్ ధరలు దిగి రానున్నాయి.
> వెట్ బ్లూ లెదర్ ను కస్టమ్స్ సుంకం నుంచి
మినహాయించారు. దీంతో లెదర్ బూట్లు, బెల్ట్లు, జాకెట్ల ధరలు
తగ్గనున్నాయి.
> శీతలీకరించిన చేపల ముక్కలపై కస్టమ్స్ సుంకాన్ని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఆ నిర్మాణరంగంలో ఉపయోగించే
పాలరాయి, ట్రావర్టిన్ వంటి వాటిపై కస్టమ్స్ సుంకాన్ని 40శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు.
> ముడి గ్రానైట్ లేదా ముక్కలుగా చేసిన గ్రానైట్పై
సుంకాన్ని 40శాతం నుంచి 20 శాతానికి దించారు.
> ఆహార పదార్థాలు, శీతల పానీయాల
ఉత్పత్తిలో వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలపై సుంకాన్ని 100 శాతం నుంచి 20శాతానికి తగ్గించారు.
> దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు.
> దిగుమతి చేసుకునే ఖరీదైన మోటార్ సైకిళ్లు.
> దిగుమతి చేసుకునే వ్యాన్లు, బస్సులు.
> 1600సీసీ
సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు.
> ఎలక్ట్రానిక్ బొమ్మల విడిభాగాలు.
> ఆభరణాలు, స్వర్ణకారులు ఉత్పత్తులు.
పెరిగేవి ఇవే:
> ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై సుంకాన్ని 10శాతం నుంచి 20 శాతానికి పెంచారు. దీంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది.
> దేశీయ టెక్స్టైల్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు..
అల్లికల దుస్తులపై కస్టమ్స్ సుంకాన్ని 10శాతం నుంచి 20శాతానికి పెంచారు.
> దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు, విలాసవంత పడవలు.
> పీవీసీ (పాలీవినైల్ క్లోరైడ్) ఉత్పత్తులు.
> దిగుమతి చేసుకునే పాదరక్షలు స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీలు.
====================
బడ్జెట్లో
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
> పోలవరం
ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
> పోలవరం
నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా రూ.12,157 కోట్లు
> విశాఖ
స్టీల్ ప్లాంట్కు రూ.3,295 కోట్లు.
> విశాఖ
పోర్టుకు రూ. 730 కోట్లు.
> రాష్ట్రంలోని
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు.
> రాష్ట్రంలో
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు రూ.186
కోట్లు లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ ను మద్దతుగా రూ.375 కోట్లు.
> రాష్ట్రంలో
రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.240 కోట్లు.
> ఏపీ
ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు
రెండో దశకు రూ.242.50 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో
కేంద్ర మంత్రి ప్రకటించారు.
====================
కొత్త పన్ను
విధానం (New
Tax Regime)లో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి
పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతోపాటు ఆ విధానంలో
శ్లాబ్లను కూడా మార్చారు. దీనికి మరో రూ. 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే
రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.
కొత్త పన్ను
విధానంలో మార్చిన శ్లాబ్ లు:
రూ.0-4
లక్షలు - సున్నా
రూ. 4-8
లక్షలు - 5%
రూ. 8-12
లక్షలు - 10%
రూ. 12-16
లక్షలు - 15%
రూ. 16-20
లక్షలు - 20%
రూ.20-24
లక్షలు - 25%
రూ. 24 లక్షల
పైన 30 శాతం
అధిక
ఆదాయదారులకు కూడా..
కొత్త పన్ను
ప్రకటనతో (Income Tax Slab Changes Budget 2025)
ప్రస్తుతం రూ.12 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి అత్యధికంగా రూ.80,000 వరకు మిగిలే
అవకాశం ఉంది.
గతంలో కొత్త
పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షల ఆదాయం దాటితే వారు ఏకంగా 30 శాతం పన్ను
చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రూ.16-20
లక్షలు,
రూ.20-24 లక్షలు, రూ.24 లక్షలు
ఆ పైన కొత్త శ్లాబ్లను తీసుకొచ్చారు. దీంతో రూ.24 లక్షల ఆదాయం దాటితేనే 30 శాతం
పన్ను (Income
Tax) పడుతుంది. దీంతో గతంలో రూ.15-24 లక్షల మధ్య
బ్రాకెట్లో ఉన్నవారికి లబ్ధి చేకూరనుంది.
====================
KEY
FEATURES OF BUDGET 2025-26
====================
0 Komentar