AP Cabinet Meeting
Highlights – 17/03/2025
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 17/03/2025
====================
ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం (మార్చి 17) ఏపీ కేబినెట్ సమావేశం
జరిగింది.
ఏపీ
క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:
> చేనేత
కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
> ఉపాధ్యాయుల
బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు.
> రాజధాని
అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం
ఆమోదం లభించింది.
> ఎస్సీ
వర్గీకరణ అంశంపైనా ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక
సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
> నంబూరులో
వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం.
> అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు
ఆమోదం
> పలు
సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం.
> వైఎస్సార్
తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్
నిర్ణయం.
> ముఖ్యమంత్రి
కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల
పోస్టులకు మంత్రివర్గం ఆమోదం.
====================
0 Komentar