AP: Intermediate
First Year 2025-26: Admission Schedule, Exam Pattern and Syllabus – Details
Here
ఏపీ: ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు - ఇంటర్ ప్రథమ సంవత్సరం 2025-26:
అడ్మిషన్ షెడ్యూల్, కొత్త పరీక్షా విధానం
మరియు సిలబస్ – పూర్తి వివరాలు ఇవే
===================
ఇంటర్మీడియట్
విద్యలో కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది. ఇక నుంచి విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ వంటి గ్రూపులతో పాటు ఎంబైపీసీ చదువుకునే అవకాశాన్ని
కల్పించింది. దీంతో వారు మెడికల్, ఇంజినీరింగ్
చదువుకోవడానికి నీట్, జేఈఈలు రాసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశం విద్యాశాఖ మంత్రి లోకేశ్ అధ్యక్షతన
అసెంబ్లీలోని ఆయన పేషిలో గురువారం నిర్వహించారు. ఇందులో 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో తీసుకురానున్న సంస్కరణలకు
ఆమోదం తెలపడంతో పాటు విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచేలా పలు కీలక నిర్ణయాలు
తీసుకున్నారు.
వివరాలు ఇవే:
1. ఎన్సీఈఆర్టీ
సిలబస్ అమలు
వచ్చే విద్యా
సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్ ను అమలు చేయనున్నారు.
మార్చిన సిలబస్ ప్రకారం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల
విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. విద్యార్థులు ఆరు సబ్జెక్టులతో ఎంబైపీసీ
చదువుకునే అవకాశం కల్పించారు. రెండు భాష సబ్జెక్టు(లాంగ్వేజీ)ల్లో ఒకటి ఆంగ్లం
తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. మరో దాంట్లో ఇష్టమైన సబ్జెక్టు ఎంపిక చేసుకోవచ్చు.
అంటే ఎంపీసీ విద్యార్థి రెండో భాషగా తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ స్థానంలో
జీవశాస్త్రం తీసుకుంటే ఎంబైపీసీ చదువుకోవచ్చు. లేదా భాషలు, సైన్సు, హ్యుమానిటీస్
విభాగాల్లో 24 సబ్జెక్టుల్లో దేన్నైనా చదువుకోవచ్చు.
అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో కాకుండా ఫిబ్రవరి చివరి వారం నుంచే
నిర్వహిస్తారు.
2. ప్రశ్నపత్రాలలో
మార్పులు:
> ప్రస్తుతం
గణితంలో ఏ, బీ గా రెండు పేపర్లు ఉండగా.. వచ్చే
ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు 100 మార్కులకు ఒకే పేపర్ ఉంటుంది. ఇప్పటి వరకు రెండు మార్కుల ప్రశ్నలు ఉండగా, కొత్త విధానంలో ఒక మార్కు ప్రశ్నలు ఇస్తారు.
> భౌతిక, రసాయనశాస్త్రాలు ప్రస్తుతం 60 మార్కుల చొప్పున ఉండగా.. వీటిని ఒక్కొక్కటి 85 మార్కులకు పెంచారు. మిగతావి 15 మార్కుల
చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటిలో కూడా ఒక మార్కు ప్రశ్నలు ఉంటాయి.
> వృక్ష, జంతు శాస్త్రం సబ్జెక్టులు కలిపి జీవశాస్త్రంగా ఒకే
సబ్జెక్టు 85 మార్కులకు ఉంటుంది. ఇందులో 43 మార్కులు వృక్షశాస్త్రం, 42 మార్కులకు జంతుశాస్త్రం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 15 మార్కులు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి రెండో ఏడాదిలోనే వీటిని
నిర్వహిస్తారు. ఇందులోనూ ఒక మార్కు ప్రశ్నలు ఇస్తారు.
> వృత్తి
విద్యా కోర్సుల్లో డ్యుయల్ సర్టిఫికెట్ విధానం ఉంటుంది. ఒకటి జాతీయ నైపుణ్య
కౌన్సిల్ సర్టిఫికెట్, ఇంకోటి ఇంటర్మీడియట్
బోర్డు సర్టిఫికెట్.
> వృత్తి
విద్య కోర్సుల కోసం ఆయా కళాశాలలు స్థానికంగా ఉన్న పరిశ్రమలతో అనుసంధానం కావాల్సి
ఉంటుంది.
3. అడ్మిషన్ల
నూతన షెడ్యూల్ - ఏప్రిల్ 1 నుంచే కళాశాలల ప్రారంభం
> ప్రథమ
సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపాదనను నిలిపివేసింది.
> 2025-26 విద్యా సంవత్సరం నుంచి జూన్ ఒకటో తేదీకి బదులు ఏప్రిల్ 1 నుంచే జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయి.
> ప్రథమ
సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి
మొదలవుతుంది.
> నీట్, జేఈఈ, ఈఏపీ సెట్లాంటి పోటీ
పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను బోర్డు పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు.
ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడంతో పాటు మెటీరియల్ ను ఉచితంగా
అందిస్తారు.
> 1973 నుంచి 2003 వరకు ఉన్న
సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేస్తారు.
===================
AP INTER 1ST YEAR 2025-26 SYLLABUS
AP INTER 1ST YEAR 2025-26 EXAM PATTERN
AP INTER 1ST YEAR 2025-26 ADMISSIONS SCHEDULE
===================
0 Komentar