AP KGBV Admissions 2025-26: New
Admissions for VI, XI Classes and Leftover Vacant Seats in VII, VIII, IX, X
& XII Classes
కస్తూర్భా
గాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశము కొరకు మరియు 7, 8, 9, 10
& 12 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తుల
వివరాలు ఇవే
=====================
ఏపీ లోని రాష్ట్రంలోని
352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) 2025-26 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలను నిర్వహిస్తున్నట్టు సమగ్ర శిక్ష పీడీ బి.
శ్రీనివాసరావు బుధవారం (మార్చి 19) ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు 7, 8, 9, 10 & 12 తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ
చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల (మార్చి) 22వ తేదీ నుంచి
ఏప్రిల్ 11 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనాథలు, బడి బయట చిన్నారు లు, డ్రాపౌట్స్
(బడి మానేసినవారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు
మాత్రమే ప్రవేశాలకు అర్హులన్నారు. వివరాలకు 70751 59996, 70750 39990 నెంబర్ లను సంప్రదించాలన్నారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 22/03/2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
11/04/2025
ఎంపికైన జాబితా
విడుదల: 21/04/2025
=====================
=====================
0 Komentar