Technical Teachers Certificate (TTC) -
42 Days Summer Training Course 2025 – Details Here
టెక్నికల్
టీచర్స్ సర్టిఫికేట్(టిటిసి) - 42 రోజుల
సమ్మర్ టైనింగ్ కోర్సు - 2025 – పూర్తి వివరాలు ఇవే
===================
'టెక్నికల్
టీచర్స్ సర్టిఫికేట్ - 42 రోజుల సమ్మర్
టైనింగ్ కోర్సు - 2024" నందు చేరుటకు
అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.
అభ్యర్ధులు 03-04-2025 నుండి 25-04-2025 వరకు వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకొనవచ్చును.
అభ్యర్ధులు, ది.01-05-2025 నాటికి
18 సంవత్సరములు నిండినవారై ఉండాలి మరియు 45 సంవత్సరములు దాటియుండరాదు.
విద్యార్హతలు:
1) 10 వ తరగతి పాస్ అయ్యి TCC లోయర్ పూర్తి చేసి
ఉండాలి.
2) SSC ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
3) Board of Intermediate Education, AP జారీ చేసిన ఒకేషనల్ పాస్ certificate కలిగి ఉండాలి.
4) State Board of Technical &
Training (S.B.T.E.T), A.P వారు జారీ చేసిన
సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
5) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు కలిగిన I. T. I ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
6) Industries మరియు Commerce డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన
లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్
సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
7) తెలుగు విశ్వ విద్యాలయం వారు జారీ చేసిన కర్నాటిక్ మ్యూజిక్ (వోకల్ లేదా వీణ
లేదా వయొలిన్) లలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
8) ఏదైనా విశ్వ విద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ కలిగి
ఉండాలి.
కోర్సు జరిగే ప్రదేశాలు: విశాఖపట్టణము, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురము
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.04.2025
దరఖాస్తు
చివరి తేది: 25.04.2025
కోర్సు తేదీలు: 01-05-2025 నుండి 11-06-2025 వరకు (42 రోజులు)
===================
===================
0 Komentar