ISRO's YUVIKA 2025: All the Details Here
యువికా – 2025 (యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్): పూర్తి వివరాలు ఇవే
====================
YUVIKA - YUva VIgyani KAryakram (Young
Scientist Programme)
====================
YUVIKA - 2025 రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ వేసవి సెలవుల్లో (మే 19-30, 2025) రెండు వారాల పాటు ఉంటుంది మరియు షెడ్యూల్‌లో ఆహ్వానించబడిన
చర్చలు,
ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాన్ని పంచుకోవడం, ప్రయోగాత్మక ప్రదర్శన, సౌకర్యం
మరియు ల్యాబ్ సందర్శనలు, చర్చల కోసం ప్రత్యేక
సెషన్‌లు ఉంటాయి. నిపుణులతో, ప్రాక్టికల్ మరియు
ఫీడ్‌బ్యాక్ సెషన్‌లు.
స్కూల్
విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌ను ఇస్రో ప్రత్యేక చేపడుతోంది. దీన్ని
YUVIKA
అని కూడా పిలుస్తారు. YUVIKA అంటే ‘యువ విజ్ఞాన కార్యక్రమం’ అని అర్థం. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్
రిజిస్ట్రేషన్స్ FEB 24 నుంచి
ప్రారంభిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇస్రో అధికారిక
పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ మే
19 నుంచి ప్రారంభమై, మే 30 వరకు కొనసాగుతుంది.
ఏడు
సెంటర్లలో ప్రోగ్రామ్:
ఇస్రోకు
చెందిన ఏడు సెంటర్లలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్
స్పేస్ సెంటర్, బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్
సెంటర్,
అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ -డెహ్రాడూన్, నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (NE-SAC)- షిల్లాంగ్ వంటి సెంటర్లలో ఈ ప్రోగ్రామ్ జరగనుంది. ఈ
ప్రోగ్రామ్‌కు సంబంధించి విద్యార్థుల ప్రయాణ ఖర్చులు, కోర్సు మెటీరియల్, వసతి, బోర్డింగ్ వంటి ఖర్చులను ఇస్రో భరిస్తుంది.
ముఖ్యమైన
తేదీలు:
రిజిస్ట్రేషన్
ప్రారంభం: 24-02-2025
రిజిస్ట్రేషన్
ముగింపు: 23-03-2025
ఎంపికైన
జాబితా-1 విడుదల: 07-04-2025
YUVIKA 2025 ప్రోగ్రామ్: మే 19-30, 2025
====================
====================
0 Komentar