Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Holi Flash Sale - Up to Rs. 26,750 Offer – Details Here

 

Ola Electric Holi Flash Sale - Up to Rs. 26,750 Offer – Details Here

ఓలా హోలీ ఫ్లాష్ సేల్ 2025 - కొనుగోలుపై రూ. 26,750 వేల వరకు డిస్కౌంట్ - పూర్తి వివరాలు ఇవే

===================

ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్ ను ప్రకటించింది. ఈ ఏడాది హోలీ పండుగ సందర్భంగా ఎస్1 శ్రేణిలోని ఎలక్ట్రిక్ స్కూటర్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిస్తోంది. నేటి నుంచి (మార్చి 13) ప్రారంభమైన ఈ సేల్ మార్చి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ సేల్ లో భాగంగా ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ. 26,750 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈవీ ధర రూ. 89,999గా ఉంది. ఓలా ఎక్స్ జెన్ 2 (s1_X + Gen 2) పై రూ. 22 వేల వరకు రాయితీ అందించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ స్కూటీ ధర రూ. 82,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఎస్1 రేంజ్లోని మిగిలిన స్కూటర్లపై రూ.25 వేల వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

మార్కెట్లోకి కొత్తగా తీసుకొచ్చిన ఎస్1 జెన్3 శ్రేణి ఈవీలకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిస్కౌంట్తో పాటు రూ.10,500 విలువైన ప్రయోజనాలను ఓలా ఎలక్ట్రిక్ అందిస్తోంది. కొత్తగా ఎస్1 జెన్2 స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఏడాది పాటు రూ.2,999 విలువైన మూవ్ ఓఎస్ + సబ్స్క్రిప్షన్ని ఉచితంగా అందిస్తోంది. రూ. 14,999 విలువైన ఎక్స్టెండెడ్ వారెంటీని రూ.7,499కే ఇస్తోంది.

===================

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags