Oscar Awards 2025: The Academy Awards -
See the Winner’s List Here
ఆస్కార్
అవార్డులు 2025: అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం -
విజేతల జాబితా ఇదే
=====================
ఆస్కార్
అవార్డుల సంబరం 2025 అంగరంగ వైభవంగా జరిగింది.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన 'అనోరా'కు (Anora) అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం,
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సొంతం
చేసుకుంది. 'ది బ్రూటలిస్ట్'లో నటనకు
గానూ ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ.. 'అనోరా'లో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. సీన్ బేకర్
(అనోరా) ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
ఇక 'ఏ రియల్ పెయిన్' చిత్రానికి కీరన్ కైల్
కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా.. 'ఎమిలియా పెరెజ్ లో నటనకు జోయా
సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల
వర్షం కురిపించిన 'డ్యూన్: పార్ట్ 2' ఉత్తమ
సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ను సొంతం
చేసుకుంది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్లో
నిలిచిన 'అనూజ' చిత్రానికి మాత్రం
నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో 'ఐయామ్ నాట్ ఏ రోబో' ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
ఆస్కార్
విజేతలు వీళ్లే..
1. ఉత్తమ
చిత్రం - అనోరా
2. ఉత్తమ
నటుడు - అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
3. ఉత్తమ
నటి - మైకీ మ్యాడిసన్ (అనోరా)
4. ఉత్తమ
దర్శకత్వం - అనోరా (సీన్ బేకర్)
5. ఉత్తమ
సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
6. ఉత్తమ
సహాయ నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
7. ఉత్తమ
స్క్రీన్ ప్లే - అనోరా (సీన్ బేకర్)
8. ఉత్తమ
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - కాన్ క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
9. ఉత్తమ
కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్వెల్)
10. ఉత్తమ
మేకప్,
హెయిల్సైల్ - ది సబాన్స్
11. ఉత్తమ
ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)
12. ఉత్తమ
సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
13. ఉత్తమ
సౌండ్ - డ్యూన్: పార్ట్ 2
14. ఉత్తమ
విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్: పార్ట్ 2
15. ఉత్తమ
ఒరిజినల్ సాంగ్ - ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
16. ఇంటర్నేషనల్
ఫీచర్ ఫిల్మ్ - ఐయామ్ స్టిల్ హియర్ (వాల్టర్ సాల్లెస్- బ్రెజిల్)
17. ఉత్తమ
ఒరిజినల్ స్కోర్ - ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్బర్గ్)
18.
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - వికెడ్
19. ఉత్తమ
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ఐయామ్ నాట్ ఏ రోబో
20. ఉత్తమ
డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
21. ఉత్తమ
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నో అదర్ ల్యాండ్
22. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
23. ఉత్తమ
యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్ - ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
=====================
=====================
0 Komentar