Padma Awards 2026: Nomination Process Started for the
Public - Details Here
పద్మ
అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి – నామినేషన్ల
పోర్టల్ లింక్ ఇదే
==================
ప్రతిభావంతులను
గుర్తించి పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను సిఫార్సు చేయాలని కేంద్రం శనివారం
(మార్చి 15) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవాన్ని
పురస్కరించుకొని ప్రకటించే ఈ పురస్కారాల కోసం ఆన్లైన్లో నామినేషన్లు, సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి తెరుచుకున్నట్లు
కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఏడాది జులై 31లోగా ప్రతిపాదనలను పంపొచ్చని పేర్కొంది.
స్వీయ
నామినేషన్లు కూడా పంపొచ్చని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ
పురస్కారాలు ఉంటాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా వీటిని ప్రకటిస్తుంటారు.
కళలు,
సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పౌర సేవల, వాణిజ్యం, పరిశ్రమలు తదితర
రంగాల్లో అసాధారణ కృషి చేసినవారిని గుర్తించడం ఈ అవార్డుల ఉద్దేశమని కేంద్రం
తెలిపింది.
నామినేషన్
ప్రారంభ తేదీ: 15/03/2025
నామినేషన్
ముగింపు తేదీ: 31/07/2025
==================
==================
0 Komentar