Sunita Williams, Butch Wilmore to return
to Earth – Timings and Live Stream Details Here
తొమ్మిది నెలల
తర్వాత భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్ & బుచ్ విల్మోర్ – సమయం మరియు ప్రత్యక్ష ప్రసారల లింక్ ల వివరాలు
ఇవే
==================
దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన
సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్
విల్మోర్ తిరిగి వస్తున్నారన్న విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి వారు బుధవారం
తెల్లవారుజామున 3.27 గంటలకు (భారత
కాలమానం ప్రకారం) పుడమికి చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా సోమవారం
ప్రకటించింది. వీరి క్రూ డ్రాగన్ వ్యోమనౌక.. ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర
జలాల్లో దిగుతుందని వివరించింది.
భారత కాలమానం
ప్రకారం సునీత తిరిగి వచ్చే సమయం వివరాలు ఇవే
> క్రూ
డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత: మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది.
> అంతరిక్ష
కేంద్రం నుంచి విడిపోవడం: ఉదయం 10.15 గంటలకు ప్రారంభం.
> భూవాతావరణంలోకి
పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలన: బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు.
> సాగర జలాల్లో ల్యాండింగ్: తెల్లవారుజామున 3.27 గంటలకు.
> సహాయ
బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి.
> ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ల్యాండింగ్
తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలిస్తారు. అక్కడ
వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక
స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా
నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.
==================
0 Komentar