World Happiness Report-2025: Finland
Tops For 8th Straight Year - Check India's
Rank Here
వరల్డ్
హ్యాపీనెస్ రిపోర్ట్-2025: ఆనందకర దేశాల్లో
వరుసగా 8వ సారి ఫిన్‌లాండ్ నెం.1, భారత్ ర్యాంక్ ఇదే
====================
మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని’
నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి
అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఎనిమిదో సారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన
దేశంగా అగ్రస్థానంలో ఫిన్లాండ్ నిలిచింది.
అంతర్జాతీయ
ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బీయింగ్
రీసర్చ్ సెంటర్ ఆనందకర దేశాల జాబితా (World Happiness Report) విడుదల చేసింది. ఇందులో మరోసారి ఫిన్లాండ్ (Finland) హ్యాపీ కంట్రీగా మొదటి స్థానం దక్కించుకుంది. ఇక ఇతర
నార్డిక్ దేశాలైన డెన్మార్క్ (2), ఐస్లాండ్ (3), స్వీడన్ (4) ఆ తర్వాతి
స్థానాల్లో ఉన్నాయి.
ఈ ఏడాది
జాబితాలో భారత్ 118వ ర్యాంక్
దక్కించుకుంది. గతేడాది మన దేశం 126వ స్థానంలో ఉండగా..
ఈ సారి ఆరు స్థానాలు ఎగబాకింది. చైనా (68), పాకిస్థాన్ (109) దేశాలు విషయంలో
మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. మరోవైపు, అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 24వ స్థానంలో నిలిచింది. పన్నెండేళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న యూఎస్.. ఆ తర్వాత నుంచి అంతకంతకూ పడిపోతూ
వస్తోందని నివేదిక తెలిపింది. సంపద, వృద్ధి
మాత్రమే కాకుండా.. సంబంధాలు, మనుషుల మధ్య
విశ్వాసం,
ఆత్మ సంతృప్తి, సామాజిక
మద్దతు,
జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల
ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
WHR-2025: ముఖ్యాంశాలు ఇవే
> హమాస్ తో
యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. సంతోషకర దేశాల్లో ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉండటం
గమనార్హం.
> కోస్టా
రికా (6వ ర్యాంక్), మెక్సికో (10వ
ర్యాంక్) దేశాలు తొలిసారి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.
> యునైటెడ్
కింగ్డమ్ ఈ జాబితాలో 23 స్థానంలో నిలవగా.. అమెరికా 24వ ర్యాంక్ సాధించింది.
> అగ్రరాజ్యంలో
గత రెండు దశాబ్దాలుగా ఒంటరిగా భోజనం చేస్తున్న వారి సంఖ్య 53శాతం పెరిగినట్లు
తేలింది.
> తాలిబన్ల
పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ ఈ ఏడాది కూడా
హ్యాపీనెస్ లో అట్టడుగున నిలిచింది.
> నెదర్లాండ్స్
(5),
కోస్టారికా (6), నార్వే (7), ఇజ్రాయెల్ (8) లక్సెంబర్గ్ (9), మెక్సికో (10).. టాప్ పది సంతోకర దేశాల జాబితాలో నిలిచాయి.
====================
ప్రపంచంలోని
మొదటి 10 సంతోషకరమైన దేశాలు ఇవే:
1. ఫిన్లాండ్
2. డెన్మార్క్
3. ఐస్లాండ్
4. స్వీడన్
5. నెదర్లాండ్స్
6. కోస్టా
రికా
7. నార్వే
8. ఇజ్రాయెల్
9. లక్సెంబర్గ్
10. మెక్సికో
====================
====================
0 Komentar