Adolescence – A Must Watch English Web Series
అడాల్సెన్స్ (కౌమారదశ)
– తప్పక చూడవలసిన ఇంగ్షీష్ వెబ్ సిరీస్
===================
ప్రత్యేకతలు:
సింగిల్ షాట్ ఎపిసోడ్ లు; పిల్లలు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజాప్రతినిధులు
తప్పక చూడవలసిన సిరీస్
===================
పిల్లల కి స్మార్ట్
ఫోన్లు, కంప్యూటర్, స్పోర్ట్స్ బైకులు, బ్రాండెడ్ దుస్తులు అన్నీ కొనిస్తాం.
స్మార్ట్ఫోన్
లో ఏం చూస్తున్నాడు? ఎవరితో
మాట్లాడుతున్నాడు? ఎప్పుడైనా ఆరా
తీశారా?
బైక్ పై ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఎప్పుడైనా అడిగి
తెలుసుకున్నారా?
'అడాల్సెన్స్'లో (Adolescence series) జామీ మిల్లర్ తండ్రి ఎడ్డి మిల్లర్ కూడా ఇలాగే చెబుతాడు. ఎప్పుడూ ఇంట్లోనే
ఉన్నా,
కొడుకు ఏం చేస్తున్నాడో, ఏం
చూస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఫలితం 13ఏళ్ల తన
కొడుకు జామీ హత్యానేరం కింద అరెస్టయితే వేదనతో కుమిలిపోతాడు. అప్పటివరకూ కొడుకుపై
ఉన్న ప్రేమ.. బాధగా మారి దుఃఖిస్తుంటే మనకూ కన్నీళ్లు ఆగవు.
ప్రముఖ ఓటీటీ
వేదిక 'నెట్ ఫ్లిక్స్' లో
స్ట్రీమింగ్ అవుతున్న ఈ మినీ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని
ఆకర్షిస్తోంది. సామాన్య తల్లిదండ్రుల నుంచి దేశాధినేతల నుంచి వరకూ ఈ సిరీస్ పై ప్రశంసల
వర్షం కురిపిస్తున్నారు.
“నా ఇద్దరు
పిల్లలతో కలిసి 'అడాల్సెన్స్' చూశా. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులు, యువకులు, బాలురపై ప్రభావం
చూపుతున్న ప్రమాదకర ఆన్లైన్ కంటెంట్ పై చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది" -
మాటలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ బ్రిటన్
ప్రధాని కీర్ స్టార్మర్.
ఏమిటీ
‘అడాల్సెన్స్'..
13 నుంచి 19 ఏళ్ల వయసును టీనేజ్ లేదా అడాల్సెన్స్ అంటారు. ప్రతి మనిషి
జీవితంలో ఇది చాలా కీలక దశ. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా టీనేజ్ పిల్లల్లో మార్పులు వేగంగా చోటు
చేసుకుంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోలేక, వచ్చే
సందేహాలను ఎవరినీ అడగలేక వారు తీవ్రంగా సతమతమవుతుంటారు. ఈ మార్పుల గురించి
చెప్పేవారు, మార్గనిర్దేశం చేసేవారు ఉండరు.
తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు ఈ విషయాల గురించి
మాట్లాడరు. గతంలో ఈ విషయాలను తెలుసుకోవాలని ఉన్నా, జీవితమే పాఠం నేర్పేది. నేటి తరానికి అంత ఓపిక లేదు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, పోర్న్ అంతా
ఆన్లైన్. మన పిల్లలు ఇంట్లోనే ఉంటారు. బయటకు వెళ్లరు. కానీ, ప్రపంచం మొత్తాన్ని చూస్తారు. చూడాల్సినవి చూడకూడనవి. కూడా.
అచ్చం జామీలాగానే.
ఈ నలుగురూ
చూడాల్సిన సిరీస్
1. తల్లిదండ్రులు:
పిల్లలు
అడిగింది ఇచ్చి బాగా చూసుకుంటున్నామని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ, నిజంగా వాళ్లకు కావాల్సిందేంటి? ఇస్తున్నదేంటి. 'మా నాన్న
నన్ను అలా పెంచితే నేనెందుకు ఇలా పెంచాను' అని
కన్నీరుమున్నీరవుతాడు. పిల్లలకు తల్లిదండ్రులే హీరోలు. చిన్నతనంలో వాళ్లే రోల్
మోడల్స్. ఎడ్డీ మిల్లర్ చేసిన తప్పును మరే తల్లిదండ్రులు చేయకూడదడానికి ఇదొక
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
2. విద్యార్థులు
ప్రతి మనిషి
జీవితంలో కౌమారం గులాబీలాంటిది. కానీ, చుట్టూ
ముళ్లను చూడకపోతే, తర్వాత జామీలా
బాధపపడాల్సి వస్తుంది. ప్రేమ, ఆకర్షణ ఈ రెండింటికీ
తేడా తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలకే మితిమీరిన కోపం, అసహనం, ఎదిరించటం, ప్రశ్నించటం తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తామే
తీసుకోగలమనే విషయాన్ని ప్రకటించుకునే క్రమంలో తల్లిదండ్రులను వ్యతిరేకించడం సరైన
పద్ధతి కాదని అర్థం చేసుకోవాలి. ముందు చాలా పెద్ద జీవితం ఉందన్న విషయాన్ని
గ్రహించాలి.
3. ఉపాధ్యాయులు:
తల్లి, తండ్రి, తర్వాత మనకు మార్గనిర్దేశం చేసేది గురువే తల్లిదండ్రులకు
చెప్పుకోలేని విషయాలను చెప్పే బాధ్యత ఉపాధ్యాయులదే. వేళకు పాఠశాలకు రాని టీచర్లు, ప్రశ్నలడిగితే కోప్పడే ఉపాధ్యాయులు ఇలా చాలా అంశాలను ఇందులో
చర్చించారు. నేటి సమాజంలో ఎంతమంది తల్లిదండ్రులకు, టీచర్లకు టీనేజర్ల సమస్యల గురించి అవగాహన ఉంది? అందుకే వారి సమస్యలు, పరిష్కారాలపై ప్రతి
స్కూల్,
కాలేజీలో అవగాహనా సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలి. అక్షయ్ కుమార్ 'OMG2' మొత్తం దీని గురించే చర్చించారు.
4. రాజకీయ నాయకులు (ప్రజాప్రతినిధులు):
యువ రక్తంతోనే దేశాభివృద్ధి సాధ్యం.
ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ వారిపై విశేషమైన ప్రభావం చూపిస్తోంది. విలువైన
సమయాన్ని సోషల్ మీడియా హరిస్తోంది. ఆన్లైన్ ఫోరమ్లు, డేటింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు, పోర్న్ యువతను నిర్వీరం చేస్తున్నాయి. వీటన్నింటికీ చెక్
పెట్టేలా నియంత్రణ ఉండేలా చట్టాలను తీసుకురావాలి.
ప్రత్యేకత: సింగిల్
టేక్ మేకింగ్
ఈ సిరీస్
క్రియేటర్స్ జేక్ థోర్న్, స్టీఫెన్ గ్రాహమ్
చాలా విషయాలను లోతుగా చూపించారు. నేటి ఆధునిక సమాజంలో బాల బాలికలపై ప్రభావం చూపేవి
ఏంటి?
ప్రవర్తన మార్పునకు కుటుంబం, పాఠశాల, సోషల్ మీడియా, చుట్టూ ఉండే స్నేహితులు ఎవరు కారణం అనే అంశాలను కళ్లకు
కట్టారు. సోషల్ మీడియా లో కనిపించే ఎమోజీస్ వెనుక ఉన్న అర్ధం ఏంటి? వాటిని నేటి యువత ఎలా ఉపయోగిస్తోంది? వంటి విషయాలను చర్చించారు.
ఇవన్నీ
ఒకెత్తయితే, సిరీస్ మేకింగ్ ఒక హైలైట్. కట్
లేకుండా ప్రతి ఎపిసోడ్ నడుస్తుంది. ఒక్కో ఎపిసోడ్ దాదాపు గంట నిడివితో సాగుతుంది.
ఇక సింగిల్ షాట్ టేకింగ్ కు అనుగుణంగా
నటీనటుల ప్రదర్శనకు నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే! తెలుగు ఆడియోలోనూ అందుబాటులో
ఉంది.
ప్రతి ఎపిసోడ్ ఒకే షాట్ లో గంట షూటింగ్ అంటే అదే గంట సీన్ ని ఎన్ని టేక్ లు తీశారో??
ఎపిసోడ్ వారీ
గా ఎన్నో టేక్ ఉపయోగించారో చూడండి.
మొదటి
ఎపిసోడ్ - 2వ టేక్;
రెండవ
ఎపిసోడ్ - 13వ టేక్;
మూడవ ఎపిసోడ్
-
12వ టేక్;
నాల్గవ
ఎపిసోడ్ - 16వ టేక్;
======================
WATCH MOVIE IN NETFLIX -LINK HERE
======================
ట్రైలర్ ని
ఇక్కడ చూడండి.
======================
0 Komentar