Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 15/04/2025

 

AP Cabinet Meeting Highlights – 15/04/2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 15/04/2025

===================

AP Cabinet Decisions-Press Briefing by Hon'ble Ministers at Publicity Cell, Block-4, AP Secretariat on 15-04-2025 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి మంత్రుల ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=wdX2elD97L0&t=1842s

===================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ లో వివరించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

> ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

> రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది.

> స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

> విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్ కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడికి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.

> ఉరుస క్లస్టరు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపు.

> బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్ కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం.

> 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం.

> వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

> త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

> ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు రూ.20వేలు పంపిణీ చేస్తామన్నారు.

> భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

> గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయించారు.

> గ్రేహౌండ్స్ విభాగానికి కొత్తవలసలో భూమి కేటాయిస్తారు.

> రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

> ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

> ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

> విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటాం.

> ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్-1లో 12 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్ రానుంది. > గ్రూప్-2లో 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.

> గ్రూప్-3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది” అని తెలిపారు.

===================

0 Komentar

Google Tags