AP: Village /Ward
Secretariats - Rationalisation & Categorisation of Functionaries &
Secretariats – G.O. Released
గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ - జనరల్, స్పెసిఫిక్
ఫంక్షనరీలుగా విభజన – మార్గదర్శకాల తో కూడిన
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
==================
గ్రామ, వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం
మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలతోపాటు వాటిలో ఉద్యోగులను
జనరల్ పర్పస్ (మల్టీపర్పస్) ఫంక్షనరీలు, స్పెసిఫిక్
(టెక్నికల్) ఫంక్షనరీలుగా పేర్కొంది. ఆ ప్రకారం ఎ, బి,
సి, కేటగిరీలుగా
విభజించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో
ప్రస్తుతం జనరల్ పర్పప్ ఫంక్షనరీల కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి.
స్పెసిఫిక్ ఫంక్షనరీల నియామకంపై విడిగా త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు
ప్రభుత్వం పేర్కొంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటివరకు 8 నుంచి 12 మంది చొప్పున
ఉద్యోగులు ఉన్నారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజల అవసరాలకు మించి ఎక్కువగా ఉద్యోగులు
ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నట్లు తేల్చారు.
సకాలంలో ప్రజలకు నిర్దేశించిన సేవలు అందించేందుకు వీలుగా జనాభా ఆధారంగా
సచివాలయాలను, ఉద్యోగులను విభజించాలని నిర్ణయించి ఆ
మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ గ్రామ, వార్డు
సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది తేల్చింది. జనాభా, గ్రామ, వార్డు స్థాయిలో
ప్రజల అవసరాలు పరిగణనలోకి తీసుకుని జనరల్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయించింది. ఒక్కో
సచివాలయంలో వీరు కనీసం ఇద్దరు.. గరిష్ఠంగా నలుగురు ఉంటారు.
1. కేటగిరీ-ఎ
గ్రామ
సచివాలయాలు: పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్
అసిస్టెంట్ లేదా మహిళా పోలీసు.
వార్డు
సచివాలయాలు: అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి లేదా డేటా ఎడ్యుకేషన్, ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యదర్శి, మహిళా
పోలీసు.
2. కేటగిరీ-బి
గ్రామ
సచివాలయాలు: పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్
అసిస్టెంట్, మహిళా పోలీసు.
వార్డు
సచివాలయాలు: అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యదర్శి, మహిళా పోలీసు.
3. కేటగిరీ-సి
గ్రామ
సచివాలయాలు: పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్
అసిస్టెంట్, మహిళా పోలీసు.
వార్డు
సచివాలయాలు: అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యదర్శి, మహిళా పోలీసు.
==================
Department of GSWS – Village /Ward
Secretariats - Rationalisation & Categorisation of Functionaries &
Secretariats – Fixing of positions to the General-purpose Functionaries based
on the category of Village /Ward Secretariats - Orders – Issued.
DEPARTMENT OF GRAMA SACHIVALAYAMS &
WARD SACHIVALAYAMS
G.O.MS.No. 3, Dated: 10-04-2025
==================
==================
0 Komentar