Gold Rate in India: Gold Rate Touches 1
Lakh for The First Time in History
బంగారం
సరికొత్త రికార్డు: భారతదేశం చరిత్రలో
తొలిసారిగా లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
==================
10 గ్రాముల
మేలిమి పసిడి ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని
అందుకోవడం ఇదే తొలిసారి. సాయంత్రం 5.30 గంటల సమయానికి 24 క్యారెట్ల పసిడి
రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది.
ఈ ఏడాది
ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు రూ.20 వేలకు పైనే పెరగడం గమనార్హం. డిసెంబర్ 31న దాదాపు రూ.
79వేలు ఉన్న పసిడి ధర. గడిచిన నాలుగున్నర నెలల్లో 26 శాతం మేర పెరిగింది. అటు వెండి ధర సైతం కిలో మళ్లీ రూ.
లక్షకు చేరువవుతోంది. గతంలో ఓ సారి లక్ష మార్కును దాటిన వెండి.. ప్రస్తుతం రూ.99,299 పలుకుతోంది.
మల్టీ
కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ 10 గ్రాముల పసిడి
తొలిసారి రూ.96 వేల మార్కు దాటింది. జూన్ నెల డెలివరీ
కాంట్రాక్ట్స్ 10 గ్రాముల పసిడి ఒక్క రోజులోనే రూ.1621 మేర పెరిగి ఇంట్రాడేలో రూ.96,875 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
==================
==================
0 Komentar