IDBI Bank
Recruitment 2025: Apply for 119 SCO Posts – Details Here
ఐడీబీఐ బ్యాంక్ లో 119 మేనేజర్
ఉద్యోగాలు జీతం: నెలకు రూ.64,820 - 1,02,300
===================
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న
మేనేజర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు: ఆడిట్-ఇన్ఫర్మేషన్ సిస్టం, ఫైనాన్స్, లీగల్, రిస్క్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేషన్-రాజ్ భాష, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్
(ఐఎండీ)-ప్రెమిసెస్, సెక్యూరిటీ, కార్పొరేట్ క్రెడిట్/రిటైల్
బ్యాంకింగ్, ఇన్మోషన్ టెక్నాలజీ & ఎంఐఎస్.
పోస్టు పేరు - ఖాళీలు
1. డిప్యూటీ జనరల్ మేనేజర్: 08
2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 42
3. మేనేజర్: 69
మొత్తం ఖాళీల సంఖ్య: 119
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీసీఏ, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్బీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్ కు 35 నుంచి 45 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు 28 నుంచి 40 ఏళ్లు, మేనేజర్ కు 25 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్ కు రూ.1,02,300, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు రూ.85,920, మేనేజర్ కు రూ.64,820.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050, ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు రూ. 250.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07/04/2025
దరఖాస్తు చివరి తేదీ: 20/04/2025
===================
===================
0 Komentar