Vaibhav Suryavanshi (14-Year-Old) Scores Fastest Century (35 Balls) - Details Here
14 ఏళ్ల వైభవ్
సూర్యవంశీ - 35 బంతుల్లో వేగవంతమైన సెంచరీ – రికార్డుల
వివరాలు ఇవే – హైలైట్స్ లింక్ ఇదే
====================
14 ఏళ్ల
ప్రాయంలో ఈ బుడతడు మాత్రం మైదానంలో మంటలు పుట్టించాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ, అత్యంత పోటీ ఉండే ఐపీఎల్ మ్యాచ్లో మేటి బౌలర్ల బౌలింగ్ ను ఊచకోత
కోసి ఔరా అనిపించాడు. ఇతనికి పద్నాలుగేళ్లంటే నమ్మం అనుకుంటూ ప్రేక్షకులు
సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా బ్యాటుతో పెను విధ్వంసం సృష్టించాడు. అతడి పేరు వైభవ్
సూర్యవంశీ. మామూలుగా బాదలేదు ఈ రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు. బౌలర్లపై
నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ.. సిక్స్లు, ఫోర్ల మోతతో
హైలైట్స్ను తలపిస్తూ.. కేవలం 35 బంతుల్లోనే శతకం
బాదేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
ఫలితంగా 210
పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేధించి.. గుజరాత్ ను చిత్తు
చిత్తుగా ఓడించింది రాజస్థాన్. వైభవ్ ఏకంగా 11 సిక్స్లు బాదేశాడు.
రాజస్థాన్
రాయల్స్ కు అదిరే విజయం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (101; 38 బంతుల్లో 7x4, 11×6) మెరుపు శతకం
బాదడంతో ఆ జట్టు సోమవారం 8 వికెట్ల తేడాతో
గుజరాత్ టైటాన్సును మట్టికరిపించింది. శుభ్మన్ గిల్ (84; 50 బంతుల్లో 5x4, 4x6), బట్లర్ (50 నాటౌట్; 26 బంతుల్లో 3x4, 4x6) చెలరేగడంతో మొదట గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
వైభవ్తో పాటు యశస్వి జైస్వాల్ (70 నాటౌట్; 40 బంతుల్లో 9x4, 2x6) విరుచుకుపడడంతో
లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ ఐపీఎల్లో 10 మ్యాచ్ల్ లో ఓడిన రాజస్థాన్ కు ఇది మూడో విజయం. 9 మ్యాచ్లో గుజరాత్ ది మూడో ఓటమి.
ఐదు నెలల
ముందు 14
ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో కోటి రూపాయలకు పైగా రేటు
పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. పది రోజుల ముందు ఆ కుర్రాడు తొలి ఐపీఎల్ మ్యాచ్
ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడం, క్రీజులో
ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడడం చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడా చిన్నోడు ఏకంగా సెంచరీ
కొట్టేశాడు.. అది కూడా కేవలం 35 బంతుల్లోనే. సోమవారం
నాటికి 14
ఏళ్ల 32 రోజుల వయసున్న ఈ
కుర్రాడు.. ఐపీఎల్లోనే కాక మొత్తంగా టీ20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్
చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం అతడిదే. ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ధాటికి..
గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యం
చిన్నబోయింది.
====================
> టీ20 క్రికెట్లో 50 పరుగులు
చేసిన యంగెస్ట్ ప్లేయర్ (14 ఏళ్ల 32 రోజులు)
> టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ (14 ఏళ్ల 32 రోజులు)
> ఐపీఎల్ లో
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ (35 బంతుల్లో)
> ఈ మెగా
టోర్నమెంట్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ.. (క్రిస్ గేల్ 30 బంతుల్లో తొలి స్థానం)
> ఒక
ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఇండియన్ (సంయుక్తంగా)-11 (మురళీ విజయ్ కూడా ఒకే ఇన్నింగ్స్ 11 సిక్స్లు బాదాడు)
> ఐపీఎల్ లో
అతిపిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు.
====================
====================
0 Komentar